Pawan Kalyan : నేరాల అడ్గాగా మారిన విశాఖ – పవన్
జనసేన పార్టీ చీఫ్ జగన్ పై ఫైర్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారంటూ ఆరోపణలు చేశారు. మూడో విడత వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీడియాతో మాట్లాడారు. విశాఖను చివరకు నేరాలకు అడ్డాగా మార్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
Pawan Kalyan Visits Sujathanagar
సొంత ఇంట్లో వారిని కాపాడు కోలేని స్థితిలో వైసీపీ ఎంపీ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక ప్రజలను ఎవరు కాపాడుతారంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. ఆయన పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో మాట్లాడారు. దుష్టులు, దుర్మార్గులను పెంచి పోషిస్తున్నారని వారంతా మహిళల మీద పడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు డ్రైవర్లు మొర పెట్టుకున్నారు. గ్రీన్ టాక్స్ రూపంలో ఏపీలో దారుణంగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో గ్రీన్ టాక్స్ రూ. 200 , తెలంగాణలో రూ. 500 ఉంటే ఒక్క ఏపీలో మాత్రం రూ. 6,600 ఉందని వాపోయారు.
Also Read : Smriti Irani Viral : స్మృతీ ఇరానీ మణిపూర్ మాటేంటి
