Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ – జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జనవాణి కార్యక్రమంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం దివాలా అంచున ఉందన్నారు. జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan Kalyan Slams CM YS Jagan
ప్రచారం తప్ప పని చేయడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా ఐఏఎస్ లకు జీతాలు వస్తాయన్నారు.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని నడిపే అధికారులకు కూడా 20వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). కొల్లేరు నీటి సమస్య దారుణంగా ఉందన్నారు. కైకలూరు, ఉండవల్లి, ముదినేపల్లిలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. 17 వేల టన్నుల వ్యర్థాలు చేరుతున్నాయని పేర్కొన్నారు.
ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. మేం ఎక్కడ నుంచి పోటీ చేస్తామన్నది వైసీపీకి అనవసరమని పేర్కొన్నారు. తాము ఎవరితో కలిస్తే వారికి వచ్చే నష్టం ఏమిటి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జీ20 సదస్సు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
Also Read : YS Jagan : కృష్ణా జలాల విధి విధానాలపై జగన్ గుస్సా
