Pawan Kalyan : జగన్ నువ్వెంత నీ బతుకెంత
నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆయన ఏకంగా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల స్థాయిని మరింత పెంచారు. గతంలో కొంత తగ్గుతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో జగన్ రెడ్డిని ఢీకొనేందుకు రెడీ అయ్యారు. తాడో పేడో తేల్చుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Shocking Comments on YS Jagan
రాష్ట్రంలో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన తెలుగుదేశం పార్టీతో జత కట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. ఈ మేరకు టీడీపీ, జనసేన పార్టీ(Janasena Party) కలిసే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. ఇక బీజేపీ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నువ్వెంత నీ బతుకెంత అంటూ కామెంట్ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్యాకేజీ స్టార్ కు అంత సీన్ లేదంటున్నాయి.
ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన సైనికులు ఇక నుంచి కలిసి పోవాలని, వైసీపీని అంతం చేసేందుకు ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డిని అనరాని మాటలు అన్న పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు సీరియస్ అయ్యారు.
Also Read : Amit Shah : అమిత్ షా రాక పీవీ సింధు కేక