Pawan Kalyan : అవినీతికి కేరాఫ్ ఏపీ సర్కార్
ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. ఆయనతో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానుండడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో మాట్లడారు.
ఏపీలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ప్రచారం జరుగతున్నట్లుగా రాష్ట్రంలో లేదన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). వాస్తవం చూస్తే అందుకు భిన్నంగా ఉందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
వైసీపీ సర్కార్ అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు కేరాఫ్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కరప్షన్ తో కూడుకున్న ప్రభుత్వాన్ని దించాలంటే అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి స్థిరమైన ప్రభుత్వం రావాలన్నారు. అది తమ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీఎం ఎవరన్నది తర్వాత తేలుతుందన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : Kajol Trail Viral : 43 మిలియన్ వ్యూస్‌తో కాజోల్ ట్రైల్ వైరల్