Pawan Kalyan Slams : ధరణి విఫలం మార్పు అవసరం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన ధరణి పూర్తిగా విఫలమైందని, మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఆయన తొలిసారిగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే తాను ఆంధ్రాలో పోరాటం చేస్తున్నానని అన్నారు.
Pawan Kalyan Shocking Comment on Dharani Scheme
నా ఇజం మానవత్వం, తెలంగాణ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని అన్నారు. సోషలిజం తమ విధానమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). నరేంద్ర మోదీ విధానాల వల్ల తెలంగాణలో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
త్యాగాల తెలంగాణలో దశాబ్ద కాలం పాటు వేచి చూసే ధోరణి అవలంభించామని అన్నారు. ఉద్యమాలకు, పోరాటాలకు పెట్టింది పేరు తెలంగాణ. ఇక్కడ తనకు అపూర్వమైన స్వాగతం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్.
మోడీ లాంటి నాయకత్వం దేశానికి అవసరమన్నారు. నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి ఉంటానని, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయని, కానీ మోడీ అంటేనే తనకు గౌరవమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ స్పూర్తి గద్దరన్న. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళతానని ప్రకటించారు. జల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : Kishan Reddy : తెలంగాణలో మార్పు తథ్యం