Pawan Kalyan YS Jagan : జ‌గ‌న్ రెడ్డీ జ‌ర జాగ్ర‌త్త – జ‌న‌సేనాని

నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan YS Jagan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క‌త్తిపూడిలో జ‌రిగిన వారాహి యాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. మ‌రింత రెచ్చి పోయారు. గ‌తంలో తన‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నార‌ని, కానీ ఈసారి అంత సీన్ లేద‌న్నారు. త‌న‌ను అడుగు పెట్ట‌కుండా ఎవడు ఆపుతాడో చూస్తానంటూ నిప్పులు చెరిగారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

అస‌లు ఈ ముఖ్య‌మంత్రికి క్లాస్ వార్ అంటే తెలుసా అని ప్ర‌శ్నారు. ఒక అధికారి త‌ప్పు చేస్తే, అవినీతికి పాల్ప‌డితే ఏసీబీ ఉంది. మ‌రి రాష్ట్రానికి సీఎంగా ఉన్న జ‌గ‌న్ రెడ్డి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌జ‌లు మౌనంగా ఉన్నంత కాలం ఇలాంటి తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో రాజ‌కీయం చేస్తున్న జ‌గ‌న్ రెడ్డికి(YS Jagan) ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌శ్నించ‌డం అన్న‌ది ప్ర‌జాస్వామ్యంలో అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ప‌రివ‌ర్త‌న కోసం తెగించి వ‌చ్చాన‌ని, మ‌మ్మ‌ల్ని రెచ్చ‌గొడితే బాగుండ‌దంటూ హెచ్చ‌రించారు. త‌మ‌కు ప‌వ‌ర్ వ‌చ్చిన రోజున మీరన్న ప్ర‌తీ మాటకు బ‌దులు తీర్చుకుంటామ‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ చీఫ్ చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపుతున్నాయి.

Also Read : Pawan Kalyan : ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధాని – ప‌వ‌న్ క‌ళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!