Pawan Kalyan : వైసీపీని అడ్రస్ లేకుండా చేయాలి
పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీలో వారాహి విజయ యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పార్టీని అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తాము పవర్ లోకి వస్తే జనరంజక పాలన సాగిస్తామన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, సంక్షేమ పథకాల పేరుతో మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్.
రాబోయే రోజుల్లో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్దం జరుగబోతోందని స్పష్టం చేశారు. ప్రజలు ఇకనైనా తమ తప్పు తెలుసు కోవాలని, పని చేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డిదేనంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ గూండాలు ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నారంటూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంచలన ఆరోపణలు చేశారు.
గోదావరి ప్రాంతంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఒక్కరు కూడా గెలవ కూడదన్నారు జనసేన పార్టీ చీఫ్. బలమైన సిద్దాంతమే మనందరినీ ఇలా కలిపిందని చెప్పారు. నా ప్రతినిధులుగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.
Also Read : TTD Booklet Release : తిరుమలలో సాలకట్ల వైభవోత్సవాలు
