Pawan Kalyan Slams : వైసీపీ గూండాల‌కు న‌ర‌కం చూపిస్తా

నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan Slams : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న వైసీపీ స‌ర్కార్ పై , ఆ పార్టీకి చెందిన నాయ‌కుల‌పై నిప్పులు చెరిగారు. ఏకంగా గూండాలంటూ సంబోదించారు. అంతే కాదు త‌న జోలికి వ‌స్తే తాట తీస్తానంటూ హెచ్చ‌రించారు. రాబోయేది త‌మ ప్ర‌భుత్వమ‌ని ఇక త‌మ‌ను ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. వారాహి యాత్ర‌లో భాగంగా శ‌నివారం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

స‌గ‌టు మ‌నిషి మీద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి న‌న్ను, ఏ హానీ చేయ‌ని త‌న‌పై , నిజాయితీగా పన్ను క‌ట్టే త‌న‌పై దౌర్జ‌న్యాలు చేయాల‌ని చూస్తే ఊరుకోనంటూ హెచ్చ‌రించారు. ఎవ‌రినీ ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. తానంటే ఏమిటో త్వ‌ర‌లోనే చూపిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు.

అవాకులు, చెవాకులు పేలే వాళ్ల తాట తీస్తానంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఓట్ల‌తో ఎన్నికైన వాళ్లు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉండ‌డం లేద‌ని గూండాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ మాయ మాట‌ల‌తో బురిడీ కొట్టిస్తున్న జ‌గ‌న్ రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చుక్క‌లు చూపిస్తాన‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో తాను పోరాటం చేస్తున్నాన‌ని, కానీ వైసీపీ నేత‌లు కావాల‌ని త‌న‌ను గెలుకుతున్నారంటూ మండిప‌డ్డారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టి దాకా ఓపిక‌తో ఉన్నాన‌ని ఇక తాను వేచి ఉండే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Also Read : Talapathy Vijay : విద్యార్థుల‌కు ఆస‌రా చ‌దువుకు భ‌రోసా

 

Leave A Reply

Your Email Id will not be published!