Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌తుకంతా అబ‌ద్ద‌మే – నాని

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. ఆదివారం తాడేప‌ల్లి గూడెంలోని వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వాన్ని దూషించ‌డం త‌ప్ప ప‌వ‌న్ చేసింది ఏమీ లేద‌న్నారు. ఈ రోజు వ‌ర‌కు పార్టీ ఎక్క‌డుందో , ఆయ‌న ఏం చేస్తున్నారో జ‌నానికి బాగా తెలుస‌న్నారు. చంద్ర‌బాబు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌జ‌లు బుద్ది చెప్పినా ఇంకా మారలేద‌న్నారు.

ఈసారి కూడా అడ్ర‌స్ లేకుండా పోతార‌ని జోష్యం చెప్పారు. బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇద్ద‌రూ ఒక‌టేన‌ని అన్నారు. పొద్ద‌స్తమానం జ‌గ‌న్ ను ఆడి పోసుకోవ‌డం త‌ప్పితే ఇంకో ప‌ని లేద‌ని ఎద్దేవా చేశారు. కుల ప్ర‌స్తావ‌న లేకుండా ఏనాడైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడాడా అని ప్ర‌శ్నించారు పేర్ని నాని. కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని చంద్ర‌బాబు మాటిచ్చి త‌ప్పాడ‌ని ఆరోపించారు.

ముద్ర‌గడ పోరాడితే చంద్ర‌బాబు దాడి చేయించాడ‌ని మ‌రి ఆనాడు ఎందుకు ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌శ్నించలేదంటూ నిల‌దీశారు . కాపుల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌డ‌ని పేర్నినాని ఆరోపించారు. వారాహి యాత్ర అంటాడు..ప‌దే ప‌దే వాయిదాలు వేస్తూ పోతున్నాడంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల కోసం క‌చ్చితంగా క‌నీసం 10 రోజులైనా ప‌ని చేశావా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ నిల‌దీశారు పేర్ని నాని.

Leave A Reply

Your Email Id will not be published!