Pawan Khera : భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ చెబుతున్నదంతా బూటకపు జాతీయ వాదమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జ్ పవన్ ఖేరా.
ఈ విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈరోజు వరకు మోదీ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. బీజేపీ కంటే ఎక్కువ ఆత్మ నిర్భర్ పార్టీని తాము ఇంత వరకు చూడలేదన్నారు.
దాని ఐటీ సెల్ సభ్యులు లేని దాన్ని కూడా ఉన్నదనే భ్రమను కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు పవన్ ఖేరా. అధికారం కోసం కాషాయా పార్టీ దోషులుగా ఉన్న వారిని కూడా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిందంటూ ఆరోపించారు.
ఈ విషయాన్ని దాచి పెట్టేందుకు కేంద్రం ఉదయ్ పూర్ కేసుపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించిందా అంటూ ప్రశ్నించారు పవన్ ఖేరా(Pawan Khera).
ఈ భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ ఎన్నికల్లో శ్రీనగర్ లోని వార్డ్ నెంబర్ 33 నుంచి మసూద్ అజార్ శిష్యుడు అహ్మద్ ఫరూఖ్ ఖాన్ కు టికెట్ ఇచ్చిందన్నారు.
ప్రవక్తపై కామెంట్స్ చేసిన నూపుర్ శర్మ, రియాజ్ అత్తారీ కూడా మీ పార్టీకి చెందిన వారు కాదా అని ప్రశ్నించారు పవన్ ఖేరా. జాతీయ వాదం ముసుగులో దేశాన్ని పొట్టన పెట్టుకుంటున్నారంటూ ఆరోపించారు.
పార్టీలో ఏం చేస్తున్నారనే దానిపై ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించాలని కోరారు.
Also Read : నూపుర్ శర్మపై కోర్టు వ్యాఖ్యలు అభ్యంతరకరం