Sheshanna Nayeem : న‌యీం అనుచ‌రుడు శేష‌న్న‌పై పీడీ యాక్ట్

చంచ‌ల్ గూడా జైలుకు త‌ర‌లింపు ..11 కేసులు

Sheshanna Nayeem : దేశంలోనే మోస్ట్ గ్యాంగ్ స్ట‌ర్ గా పేరొందిన న‌యీం అనుచ‌రుడైన శేష‌న్న‌పై హైద‌రాబాద్ పోలీసులు పీడీ యాక్టు న‌మోదు చేశారు. ఆయ‌న‌ను అరెస్ట్ చేసి చంచ‌ల్ గూడా చెర‌సాల‌కు త‌ర‌లించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 11 కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. మాజీ మావోయిస్టు సాంబ‌శివుడు సోద‌రుడు కోనాపురి రాములుతో పాటు మ‌హ‌బూబ్ న‌గర్ లో ఓ కానిస్టేబుల్ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు శేష‌న్న‌(Sheshanna).

న‌యీంను షాద్ న‌గ‌ర్ వ‌ద్ద ఎన్ కౌంట‌ర్ కు గుర‌య్యాడు. ఆ త‌ర్వాత ప్ర‌ధాన అనుచ‌రుడిగా శేష‌న్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సెటిల్ మెంట్లు, దందాలు ప్రారంభించాడు. మూడు నెల‌ల కింద‌ట శేష‌న్న(Sheshanna Nayeem) దేశీ తుపాకీతో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. శేష‌న్న‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప‌లు కేసులు న‌మోదు చేశారు.

కోర్టుకు త‌ర‌లించారు. ఆయ‌న‌కు కోర్టు రిమాండ్ విధించింది. శేష‌న్న‌ది ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా. మావోయిస్టు పార్టీలో చేరాడు. అక్క‌డ న‌యీంతో ప‌రిచయం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చాక స్వంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్యాంగ్ ద్వారానే క‌బ్జాలు, కిడ్నాప్ లు, బెదిరింపులు, దందాల‌కు పాల్ప‌డ్డారు.

శేష‌న్న‌కు సంబంధించి అచ్పంపేట‌లో 2 కేసులు ఉండ‌గా నారాయ‌ణ‌పేట‌, సుల్తాన్ బ‌జార్ , ప‌హాడీ ష‌రీఫ్ , త‌దిత‌ర ప్రాంతాల‌లో కేసులు న‌మోద‌య్యాయి. 1993లో మొద‌టిసారి ఎఫ్ఐఆర్ న‌మోదైంది. గ‌న్స్ తో బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. శేస‌న్న కోన‌పూరి రాములుతో పాటు ఐపీఎస్ వ్యాస్ , ప‌టోళ్ల గోవ‌ర్ద‌న్ రెడ్డి, శ్రీ‌నివాస రావు, శ్రీ‌ధ‌ర్ రెడ్డి, క‌న‌కా చారి టీచ‌ర్ హ‌త్య కేసుల్లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నారు.

Also Read : న‌టుడు ‘వ‌ల్ల‌భ‌నేని’ ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!