Modi : ప్రపంచంలో యుద్దాన్ని వ్యతిరేకిస్తున్న ఏకైక దేశం భారత దేశం. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ప్రతి దేశంతో తాము సత్ సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటాం. ఇదే మా అభిమతం.
మా విదేశాంగ విధానం కూడా ఇదే నమ్ముతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తోందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi ). ఉక్రెయిన్ పై రష్యా దాడులకు దిగడాన్ని తాము వ్యతిరేకించామని ఇరు దేశాలు కలిసి మాట్లాడు కోవాలని చెప్పామన్నారు.
యుద్దంలో ఎవరో ఒకరు గెలవచ్చు. కానీ మిగిలేది విషాదం మాత్రమే. మనకు కావాల్సింది విజయాలు కాదు. ఈ ప్రపంచానికి శాంతి అవసరం అని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్, రష్యా వార్ వల్ల ఆ దేశాలతో పాటు ప్రపంచంపై కూడా పెను ప్రభావం చూపుతోందన్నారు నరేంద్ర మోదీ(Modi ). ఇప్పటికే కోలుకోలేని రీతిలో ఉక్రెయిన్ దెబ్బ తిన్నదని, ప్రాణ నష్టం సంభవించిందని , ఆధిపత్య ధోరణిని విడనాడి కలిసి ముందుకు సాగాలని కోరుతున్నామన్నారు.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మూడు రోజుల పాటు యూరోప్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జర్మన్ లో ఆయన కాలు మోపారు. ప్రధాన మంత్రికి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించడం విశేషం.
అంతకు ముందు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్డ్ తో పీఎం చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ.
ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా పెరగాలని కోరుకున్నామని జర్మన్ చాన్సలర్ చెప్పారు. ప్రధాన రంగాలలో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చున్నాయి.
Also Read : ఉక్రెయిన్ కు స్పెయిన్ భారీ గిఫ్ట్