Mallepalli Laxmaiah : మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య‌కు శాంతి పుర‌స్కారం

ఆల్ ఇండియా బ‌జ్మే ర‌హ్మ‌తే ఆలం సంస్థ

Mallepalli Laxmaiah : ర‌చ‌యిత, జ‌ర్న‌లిస్టు మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య‌కు అరుదైన గుర్తింపు ల‌భించింది. హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ సంస్థ ఆల్ ఇండియా బ‌జ్మే రహ్మ‌తే ఆలం సంస్థ చైర్న‌మ్ , ప్ర‌ముఖ న్యాయ‌వాది ఎం.ఎ.ముజీబ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈ సంస్థ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ వ‌స్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొన్నేళ్లుగా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా

ప్ర‌తి ఏటా సంస్థ ఏర్ప‌డిన నాటి నుంచి ముస్లిం స‌మాజం గురించి, స‌మాజంలో శాంతి, సామ‌ర‌స్యం, అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను గుర్తించి శాంతి పుర‌స్కారం (అవార్డు)తో స‌త్క‌రిస్తూ వ‌స్తోంది.

ఇందుకు నిపుణుల‌తో కూడిన క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా అవార్డుకు ఎంపిక చేస్తుంది. తాజాగా ఈ ఏడాది 2022 సంవ‌త్స‌రానికి గాను సెంట‌ర్ ఫ‌ర్

ద‌ళిత్ స్ట‌డీస్ చైర్మ‌న్ మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య‌ను(Mallepalli Laxmaiah)  ఎంపిక చేసిన‌ట్లు ఏఐబీఆర్ఏ చైర్మ‌న్ , ఫౌండ‌ర్ ఎంఏ ముజీబ్ వెల్ల‌డించారు. ఈ

విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆయ‌న జీవితం, ఇచ్చిన సందేశం గురించి విస్తృతంగా రీసెర్చ్ చేసి ప‌లు వ్యాసాలు రాశారని అందుకే మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య‌ను ఎంపిక

చేసిన‌ట్లు తెలిపారు ఎంఏ ముజీబ్. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురికి శాంతి పుర‌స్కారాలు అంద‌జేశామ‌న్నారు.

ప్ర‌స్తుతం ఏడోసారి ల‌క్ష్మ‌య్య కు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు కెప్టెన్ పాండు రంగారావు, కంచె ఎల్ల‌య్య‌, హెన్రీ మార్టిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ స్ట‌డీస్ డైరెక్ట‌ర్ పీట‌ర్ సాల్మాన్, రాజ‌స్తానీ ర‌చ‌యిత రాజీవ్ శ‌ర్మ‌, ప్ర‌ముఖ చారిత్రిక వేత్త‌, ర‌చ‌యిత రాం పునియాని, అర‌బిక్ ఆర్టిస్ట్ , ర‌చ‌యిత

అనిల్ కుమార్ చౌహాన్ కు శాంతి పుర‌స్కారాల‌ను అంద‌జేశామ‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఆదివారం జ‌రిగే కార్య‌క్ర‌మంలో శాంతి పుర‌స్కారాన్ని అంద‌జేయ‌నున్న‌ట్లు సంస్థ చీఫ్ తెలిపారు.

Also Read : చోళుల కాలంలో హిందూ మ‌తం లేదు

Leave A Reply

Your Email Id will not be published!