PM Modi : అధికారం లేకుండా శాంతి అసాధ్యం – మోదీ

కార్గిల్ సైనికుల‌కు ప్ర‌ధాన‌మంత్రి సందేశం

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌క్తి (అధికారం) లేకుండా శాంతి అసాధ్యం అని పేర్కొన్నారు. సోమ‌వారం దీపావళి సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌తి ఏటా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ల‌ఢ‌క్ లోని కార్గిల్ లో సైనికుల‌తో గ‌డుపుతారు.

వారితో ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి(PM Modi)  చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. మీరు లేకపోతే ఈ దేశం లేద‌న్నారు. శాంతి వెల్లి విరియాలంటే మీరంతా ఉండాల‌న్నారు మోదీ. సైనికులు లేకుండా తాను దీపావ‌ళిని ఊహించ లేనంటూ స్ప‌ష్టం చేశారు.

అయితే త‌మ ప్ర‌భుత్వం ఎప్పుడూ యుద్దాన్ని చివ‌రి ఎంపిక‌గా భావిస్తుంద‌ని చెప్పారు. లంక‌లో జ‌రిగినా లేదా కురుక్షేత్రంలో జ‌రిగినా చివ‌రి వ‌ర‌కు దానిని నిరోధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తామ‌న‌ని పేర్కొన్నారు. సైనికుల‌ను ఈ సంద‌ర్భంగా త‌న కుటుంబం అంటూ సంబోధించాడు.

సైనికులు ప్ర‌ద‌ర్శిస్తున్న దైర్య సాహ‌సాల‌ను కొనియాడారు. కార్గిల్ విజ‌యాన్ని చూడ‌ని చోట పాకిస్తాన్ తో యుద్దం జ‌ర‌గ‌లేద‌ని అన్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. నా దీపావ‌ళి పండుగ మీ మ‌ధ్య‌న జ‌రుపు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఉగ్ర‌వాదంపై పోరును కొనియాడారు. మీ ధైర్యం అద్భుతం. మీ సాహ‌సం ప్ర‌శంసనీయ‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి. ద్రాస్, బ‌టాలిక్, టైగ‌ర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయ‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి. కార్గిల్ లో మ‌న సైనికులు తీవ్ర‌వాదాన్ని అణిచి వేశార‌ని దానికి నేనే సాక్షిన‌ని తెలిపారు.

Also Read : సైనికుల‌తో ఉండ‌ట‌మే నిజ‌మైన దీపావ‌ళి

Leave A Reply

Your Email Id will not be published!