Peddireddy Ramachandra Reddy : 26 నుండి వైసీపీ బస్సు యాత్ర
మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి
Peddireddy Ramachandra Reddy : చిత్తూరు – రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి. చిత్తూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పరిశీలకులతో మంత్రి సమీక్ష చేపట్టారు.
Peddireddy Ramachandra Reddy Said
ఇదిలా ఉండగా ఈనెల 26 నుండి సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి(Peddireddy Ramachandra Reddy). వై ఏపీ నీడ్స్ అనే పేరుతో దీనిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి కూడా హాజరయ్యారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో జగన్ సారథ్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదర్శ ప్రాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాలలో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించారు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.
ఇవాళ తమ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శ ప్రాయంగా మారాయని పేర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. టీడీపీకి అంత సీన్ లేదన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.
Also Read : Eatala Rajender : పంతం నెగ్గించుకున్న ఈటెల