Penny Wong : దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం – పెన్నీ
ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి
Penny Wong : ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె భారత దేశ సార్వభౌమత్వం గురించి ప్రస్తావించారు. జాతీయ ఛానెల్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. భారత దేశం పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని పేర్కొన్నారు. జి20 సమావేశాల్లో పాల్గొనేందుకు పెన్నీ వాంగ్(Penny Wong) ఇండియాకు వచ్చారు. భారత సమాజంపై చెదురు మదురు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో తమ గడ్డపై ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనను తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు.
తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. జనవరి లో మెల్ బోర్న్ లో జాతీయ జెండాను పట్టుకుని వెళుతున్న భారతీయ బృందాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఇటీవల వారు బ్రిస్బేన్ లోని భారత గౌరవ కాన్సులేట్ ను లక్ష్యంగా చేసుకున్నారు. వేర్పాటు వాద గ్రూపు మద్దతుదారులు గౌరవ కాన్సులేట్ ఆఫీసు ముందు ఖలిస్తాన్ జెండాను ఎగుర వేశారు. తాము భారత దేశ సార్వ భౌమత్వాన్ని గౌరవిస్తాం. లేవనెత్తిన ఖలిస్తానీ సమస్య స్పష్టంగా నిరసనల ద్వారా వచ్చిందని గుర్తించాం.
కానీ వారికి ఎటువంటి హోదా లేదన్నారు పెన్నీ వాంగ్(Penny Wong) . ప్రజలు సురక్షితంగా భావించే ప్రజాస్వామ్యాన్ని , ఆ సమాజాన్ని ఎక్కువగా నమ్ముతారని అన్నారు. ఇవాళ, రేపు జరగనున్న జి20 దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు పెన్నీ వాంగ్. ఈ ఏడాది జి20 అధ్యక్ష పదవిని భారత్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 18న ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఖలిస్తానీ మద్దతు దారులు సృష్టించిన అవాంతరాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు జై శంకర్.
Also Read : ఆర్బీఐ గవర్నర్ తో బిల్ గేట్స్ భేటీ