Ghulam Nabi Azad : పదవుల కంటే ప్రజలే ముఖ్యం – ఆజాద్
ప్రజలే చరిత్ర నిర్మాతలన్న ట్రబుల్ షూటర్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
తాను కొత్త పార్టీ పెట్ట బోతున్నానని కానీ తాను ప్రకటించడం లేదన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రజలే పార్టీ పేరును, జెండాను, ఎజెండాను వాళ్లే నిర్ణయిస్తారని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తాను కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు అన్ని పదవులు చేపట్టానని కానీ తనకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad).
తాను విమర్శలు పట్టించుకోనని పని చేయడం వరకు మాత్రమే తెలుసన్నారు. తాను ప్రజల మనిషినని తాను ఎక్కడికీ వెళ్లనని చెప్పారు.
తాను ఇక్కడే ఉంటానని జమ్మూ కాశ్మీర్ ప్రజల బాగు కోసం తాను ఈ ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు ఆజాద్. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రధానంగా రాహుల్ గాంధీ నిర్వాకం కారణంగానే పార్టీ నాశనమైందని ధ్వజమెత్తారు.
50 ఏళ్ల అనుబంధాన్ని తాను ప్రజల కోసం వదులుకున్నానని అన్నారు. తనకు మీరే ముఖ్యమని మరోసారి కుండబద్దలు కొట్టారు. కాగా తాను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పారు గులాం నబీ ఆజాద్.
వారు నానుంచి ఏమీ పొందలేరు. నేను వారి నుంచి ఏమీ ఆశించడం లేదన్నారు . ప్రజలు స్పష్టంగా పని చేసే నాయకుడు కావాలని కోరుతున్నారని ఇప్పటికే తాను ఒకసారి సీఎంగా కూడా పని చేశానని చెప్పారు ఆజాద్.
Also Read : జార్ఖండ్ సీఎం బల నిరూపణకు సిద్దం