Rahul Gandhi Yatra : రాహుల్ యాత్రకు జనం జేజేలు
తెలంగాణలో కొనసాగుతున్నయాత్ర
Rahul Gandhi Yatra : రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయనకు జనం జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చిన్నారులు, యువతీ యువకులు, వృద్దులు సైతం అడుగులో అడుగు వేస్తున్నారు.
రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తయింది. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశిస్తారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ పాదయాత్రను(Rahul Gandhi Yatra) ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో విద్వేషాలను రెచ్చ గొడుతూ భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ఓట్ల రాజకీయాలకు తెర లేపాయంటూ ఆరోపించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్, సీఎం కేసీఆర్ పై సెటైర్లు విసిరారు. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఆయన పార్టీ అమెరికా, చైనాలో కూడా పోటీ చేసుకోవచ్చని కుండ బద్దలు కొట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు అంటూ ఉంటుందని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు రాహుల్ గాంధీ. అదంతా ప్రచారం తప్పా వాస్తవం కాదన్నారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతి ఒక్కరి సమస్యను తాను వినేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలన ఏనాడో మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రచారం మీద ఉన్నంత ఆసక్తి పాలనపై లేదన్నారు.
Also Read : పాలస్తీనా శరణార్థుల కోసం భారత్ సాయం