Uddhav Thackeray : షిండేను ప్రజలు క్షమించరు – ఠాక్రే
మరాఠా సీఎంపై మాజీ సీఎం ఫైర్
Uddhav Thackeray : మరాఠా మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. సీఎం ఏక్ నాథ్ షిండేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసిన ఘనత షిండేకు చెల్లుతుందన్నారు. బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీకి ద్రోహం తలపెట్టిన వారిని ఎప్పటికీ క్షమించరన్నారు.
విజయ దశమిని పురస్కరించుకుని ముంబైలో భారీ ర్యాలీ చేపట్టారు. మరో వైపు సీఎం షిండే ఆధ్వర్యంలో సైతం ర్యాలీ చేపట్టారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని నగరం పోటా పోటీగా ర్యాలీలతో దద్దరిల్లింది. వేలాదిగా జనం తరలి వచ్చారు. హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. ద్రోహం తలపెట్టిన వారు ఎప్పటికైనా ద్రోహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray).
సామాన్య కార్యకర్తలను అత్యున్నత పదవులు పొందేలా తయారు చేసిన ఘనత శివసేన పార్టీకి దక్కుతుందన్నారు. కానీ తమ ఉన్నతికి దోహద పడిన పార్టిని కాదనుకుని ప్రత్యర్థులతో చేతులతో కలిపి అక్రమ పద్దతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ మండిపడ్డారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది తేలుతుందన్నారు ఉద్దవ్ ఠాక్రే.
విచిత్రం ఏమిటంటే ఏక్ నాథ్ షిండే చేపట్టిన దసరా ర్యాలీలో ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) సోదరుడు జైదేవ్ థాకరరే, విడి పోయిన భార్య స్మితా ఠాక్రే పాల్గొన్నారు. శివసేన ఫౌండర్ బాలా సాహెబ్ ఠాక్రేకు వ్యక్తిగత సహాయకుడిగా 25 ఏళ్లకు పైగా సేవలు అందించిన చంపా సింగ్ థాపాతో పాటు బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే పాల్గొనడం విశేషం.
Also Read : శివసేన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు