Mamata Banerjee : పాలిటిక్స్ కంటే ప్ర‌జ‌ల ప్రాణాలు ముఖ్యం

సీబీఐ..ఈడీకి అప్ప‌గించాల‌ని డిమాండ్

Mamata Banerjee : గుజ‌రాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు చేయొద్ద‌ని కోరారు టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. ఇదే స‌మ‌యంలో సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయంటూ ప్ర‌శ్నించారు.

నిరంత‌రం ర‌ద్దీగా ఉండే కోల్ క‌తా ర‌హ‌దారిపై వంతెన కూలిన త‌ర్వాత 2016లో చేసిన మోస‌పూరిత చ‌ర్య కామెంట్స్ పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) నిరాక‌రించ‌డం విశేషం. బుధ‌వారం సీఎం మ‌మ‌తా మీడియాతో మాట్లాడారు. 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోవ‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇది అత్యంత విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌గా పేర్కొన్నారు సీఎం. ప్ర‌జ‌ల జీవితాలు ముఖ్య‌మైన‌వి. జ‌రిగిన ఘ‌ట‌న బాధాక‌రం. మాట‌ల‌తో చెప్ప‌లేను. ఎక్క‌డ జ‌రిగినా ముందు బాధ ప‌డ‌క త‌ప్ప‌దు. మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు మ‌మతా బెనర్జీ.

మాన‌వ తప్పిద‌మా లేక పాల‌కుల వైఫ‌ల్యమా అన్న దాని గురించి తాను మాట్లాడ ద‌ల్చు కోలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ అంశంపై రాజ‌కీయాల్లోకి వెళ్ల బోనంటూ పేర్కొన్నారు దీదీ. త‌మిళ‌నాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్(MK Stalin) ను క‌లిసేందుకు ఆమె చెన్నైకి బ‌య‌లు దేరారు.

ఈ సంద‌ర్బంగా మ‌మ‌తా బెన‌ర్జీ కోల్ క‌తాలో మాట్లాడారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపేందుకు సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని సీఎం డిమాండ్ చేశారు.

రాజ‌కీయాల కంటే ప్ర‌జ‌ల ప్రాణాలే త‌న‌కు ముఖ్య‌మ‌న్నారు. త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఎల్జీ అడ్డుకున్నా యోగా క్లాసుల ప‌థ‌కం ఆగ‌దు

Leave A Reply

Your Email Id will not be published!