Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం , జన హితం కోసం తాను భారత్ జోడో యాత్రను చేపట్టానని అన్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు రాహుల్ యాత్రలో పాలు పంచుకుంటున్నారు. రాహుల్ గాంధీకి(Rahul Gandhi) జేజేలు పలుకుతున్నారు.
కుల, మతాలకు అతీతంగా జనం రాహుల్ తో అడుగులు వేస్తున్నారు. ఒక రకంగా ఆయన చేపట్టిన యాత్ర మరో స్వాతంత్ర సమరాన్ని తలపింప చేస్తోంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ జాతిని భ్రష్టు పట్టించిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.
ఈ దేశంలో ప్రభుత్వ ఆస్తులను గంప గుత్తగా అమ్మకానికి పెట్టారని, ఇంకేం ఉందని అమ్మటానికి అంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). 140 కోట్ల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేవలం 200 మంది వ్యాపారులు, కార్పొరేట్లు , బడా బాబులు, ఆర్థిక నేరగాళ్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవుల కోసమో లేక అధికారం కోసమో తాను పాదయాత్ర చేయడం లేదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడ లేదని స్పష్టం చేశారు. ఎవరు వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసన్నారు. రాను రాను ప్రజలను కూడా మోదీ అమ్మేస్తాడని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు.
Also Read : జోషిమఠ్ పరిస్థితిపై రాహుల్ ఆందోళన