Perni Nani Chiranjeevi : చిరంజీవిపై పేర్ని నాని ఫైర్
విభజన సమయంలో ఏడున్నారు
Perni Nani Chiranjeevi : ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చిరంజీవి ఎందుకు మాట్లాడ లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు.
Perni Nani Chiranjeevi Comments
విచిత్రం ఏమిటంటే చిరంజీవి సినిమాలకు రెమ్యూనరేషన్ ఎవరైనా , ఎప్పుడైనా అడిగిరా అని మండిపడ్డారు పేర్ని నాని(Perni Nani). కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాట్లాడే ముందు చిరంజీవి ఆలోచించి మాట్లాడాలని సూచించారు పేర్ని నాని. ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య 200 రోజుల పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ గురించి ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటూ ప్రశ్నించారు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారంటూ నిలదీశారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలన్నారు. పేద వారి కడుపు నింపే ఆలోచనలు చేయాలని ఓ ఉచిత సలహా పారేశారు.
Also Read : Kodali Nani : పకోడిగాళ్లు సలహా ఇస్తే ఎలా – నాని
