Perni Nani Chandrababu : చంద్రబాబు నయ వంచకుడు – నాని
ఏం వ్యాపారం చేసి వేయి కోట్లకు ఎదిగాడు
Perni Nani Chandrababu : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandrababu)పై నిప్పులు చెరిగారు. బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికారంలోకి రాడని జోష్యం చెప్పారు. దేశంలోనే అత్యంత ధనవంతమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఏం వ్యాపారం చేసి రూ. 1,000 కోట్లు సంపాదించాడని ప్రశ్నించారు పేర్ని నాని. బాబు నయ వంచకుడని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
రాజమండ్రిలో చేపట్టిన మహానాడు ఆత్మ స్తుతి, పర నింద తప్ప, తన గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. మరొక్కసారి ఓట్ల కోసం వల వేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడని ఆరోపించారు పేర్ని నాని. స్వంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడని నిలదీశారు.
రామోజీరావుతో కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన చరిత్ర బాబుదని మండిపడ్డారు పేర్ని నాని(Perni Nani). గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రచారం చేశాడని, ఇప్పుడు కొత్తగా మరో పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి. చంద్రబాబును ప్రజలు నమ్మడం ఎప్పుడో మానేశారని , ఇప్పుడు కొత్త దుకాణం తెరిస్తే ఎలా స్వాగతం పలుకుతారంటూ నిలదీశారు.
2 ఎకరాలు ఉన్న చంద్రబాబు రూ. 1, 000 కోట్లకు ఎలా ఎదిగాడని మండిపడ్డారు. అబద్దాలకు, మోసాలకు కేరాఫ్ నారా అని పేర్కొన్నారు. నరకాసురుడిని నమ్మ వచ్చని కానీ చంద్రబాబు నాయుడిని నమ్మ వద్దని సూచించారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న నువ్వు ఎంత మంది పేదలను ధనవంతులను చేశావో చెప్పాలని సవాల్ విసిరారు పేర్ని నాని.
Also Read : Botsa Satyanarayana
