Perni Nani : పార్టీ గుర్తు లేనోడీకి పవర్ ఎట్లా
మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్
Perni Nani : తనపై నోరు పారేసుకున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. పవర్ లోకి రావాలంటే కనీసం 80 సీట్లకు పైగా గెలవాలి. ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలంటే ఓ పార్టీ ఉండాలి. దానికి గుర్తింపు ఉండాలి. మొన్నే కేంద్ర ఎన్నికల సంఘం గాలి తీసేసింది. పార్టీ ఉన్న గుర్తును తొలగించింది. మరి ఎవరి గుర్తుతో పోటీ చేస్తావో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడాడం, నోరు పారేసుకోవడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత అక్టోబర్ 18న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లా. నా చెప్పులలో ఒక దానిని ఒకరు తెలిసీ తెలియకో కొట్టేశారు. దాని ఎదురుగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఉందని తాను అనుమానించలేం కదా అని ఎద్దేవా చేశారు. ఒక స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కావాలన్నా లేదా అనిపించు కోవాలన్నా దానికంటూ ఓ పద్దతి ఉంటుందన్నారు పేర్ని నాని.
రాజకీయాలు చేయాలంటే సినిమాలు చేసినంత ఈజీ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అసలు పార్టీ గుర్తు లేనోడికి పవర్ ఎట్లా వస్తుందో కాస్తంత చెబితే తాము కూడా నేర్చుకుంటామని అన్నారు పేర్ని నాని(Perni Nani). చెప్పులు పోయాయని బాధ పడుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. ముందు నీ గాజు గ్లాసు పోయింది దాని సంగతి చూస్కో అంటూ సెటైర్ వేశారు పేర్ని నాని.
Also Read : YS Sharmila : టీఎస్పీఎస్సీ తండ్రీ కొడుకుల జేబు సంస్థ