Petrol Diesel Hike : రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కేంద్ర సర్కార్ మౌనం ఎప్పటిలాగే వహిస్తూ వచ్చింది. దీంతో గత 12 రోజులుగా కంటిన్యూగా ధరలు పెంచుతూ వచ్చాయి ఆయిల్, గ్యాస్ కంపెనీలు.
ఈ దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. దీంతో కొంత కాలం పెంచకుండా ఉంటూ వచ్చిన కంపెనీలు తాజాగా ధరల మోత మోగిస్తున్నాయి.
ఆయిల్ కంపెనీల దెబ్బకు వాహనదారులు, వినియోగదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగున్నర నెలల విరామం తర్వాత ధరలు పెరగడం ఇది 12వ సారి.
మొత్తం మీద పెట్రోల్ ధర లీటరుకు రూ. 8.40 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Hike)సోమవారం లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి. గత రెండు వారాల్లో గణనీయంగా పెంచడం వస్తున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ. 103.41 నుండి రూ. 13.81 అవుతుంది. డీజిల్ ధరలు లీటరుకు రూ. 94.67 నుంచి రూ. 95.07కి పెరిగాయని రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ కొత్తగా జారీ చేశారు.
దేశ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. గత మార్చి నెల 22న రేట్ల సవరణ మళ్లీ కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఆయిల్ కంపెనీలపై పట్టు కోల్పోయిందని విపక్షాలు మండి పడుతున్నాయి.
ఇద్దరు లేదా ముగ్గురు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం మాత్రమే మోదీ పని చేస్తున్నారంటూ ఆరోపించాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Also Read : బీజేపీపై సీఎం స్టాలిన్ సెటైర్