Petrol Diesel Hike : మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు

ధ‌రా భారంపై స‌ర్వత్రా ఆగ్ర‌హం

Petrol Diesel Hike : ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. కాషాయం ఊహించ‌ని రీతిలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. నాలుగు రాష్ట్రాల‌లో జెండా ఎగుర‌వేసింది. ఎన్నిక‌ల పుణ్య‌మా అని పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను (Petrol Diesel Hike)పెంచ‌కుండా వ‌చ్చిన ఆయిల్, గ్యాస్ కంపెనీలు ఉన్న‌ట్టుండి ఫ‌లితాలు వెలువ‌డ‌డంతో బాదుడు మొద‌లు పెట్టాయి.

కంటిన్యూగా 13 రోజులుగా పెంచుతూ వ‌చ్చాయి. మార్చి 22న రేట్ల స‌వ‌ర‌ణ‌లో నాలుగున్న‌ర నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత ధ‌ర‌ల వ‌డ్డ‌న కొన‌సాగుతోంది. ఇక తాజాగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ లీట‌ర్ కు 80 పైస‌ల చొప్పున పెంచాయి.

గ‌త రెండు వారాల్లో మొత్తం ధ‌ర‌లు లీట‌రుకు రూ. 9.20 కి పెరిగాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర(Petrol Diesel Hike) రూ. 104.61 కాగా డీజిల్ లీట‌ర్ ధ‌ర రూ. 95.87కి పెరిగింది.

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో ధ‌ర‌లు పెరిగాయి. ధ‌రా భారాన్ని నిర‌సిస్తూ విప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డాయి. పార్లమెంట్ లో అధికార పార్టీని నిల‌దీశాయి.

కానీ మోదీ స్పందించ‌డం లేదు. బీజేపీ విజ‌యోత్స‌వాల‌లో మునిగి పోయింది. ఇక పెంచిన 80 పైస‌లు అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. వీటికి డీల‌ర్ క‌మిష‌న్ , వ్యాట్ త‌దిత‌ర వాటిని క‌లుపుకుంటే పెట్రోల్ లీట‌ర్ కు 91 పైస‌లు, డీజిల్ లీట‌ర్ కు 87 పైస‌లు పెంచాయి చ‌మురు కంపెనీలు.

హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 118. 59 కి పెరిగితే డీజిల్ ధ‌ర రూ. 104.62కి చేరింది. గ‌త రెండు వారాలుగా చూస్తే డీల‌ర్ క‌మిషన్ , వ్యాట్ క‌లుపుకుంటే పెట్రోల్ ధ‌ర రూ. 10.39 పెరిగితే డీజిల్ ధ‌ర రూ. 10.57కి చేరింది.

Also Read : మోదీతో కాంగ్రెస్ ఎంపీ బిట్టూ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!