Petrol Hike PAK : పెట్రోల్ వాత డీజిల్ మోత

పాకిస్తాన్ లో కొండెక్కిన ధ‌ర‌లు

Petrol Hike PAK : పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెల‌కొంది. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు కొండెక్కాయి. వినియోగదారులు నిత్యం వాడే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొండెక్కాయి. రోజూ పెరుగుతూనే ఉన్నాయి. రూ. 22.20 పెరిగిన త‌ర్వాత పెట్రోల్ ధ‌ర లీట‌ర్ కు రూ. 272కు పెరిగింది.

డాల‌ర్ తో రూపాయి విలువ క్షీణించ‌డం వ‌ల్ల ఈ పెరుగుద‌ల చోటు చేసుకుంద‌ని పాకిస్తాన్ ఆర్థిక శాఖ వెల్ల‌డించింది. ఇక‌పెట్రోల్ ధ‌ర ఇలా ఉంటే డీజిల్ ధ‌ర లీట‌ర్ కు రూ.280కి పెరగ‌డంతో వినియోగదారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప‌న్నుతో కూడిన మినీ బ‌డ్జెట్ ను విడుద‌ల చేసిన కొన్ని గంట‌ల త‌ర్వాత కీల‌క‌మైన రుణాన్ని అన్ లాక్ చేసినందుకు అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్) ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పాకిస్తాన్ స‌ర్కార్ పెట్రోల్ , డీజిల్(Petrol Hike PAK) , గ్యాస్ ధ‌ర‌ల‌ను భారీ ఎత్తున పెంచింది. ఈ విష‌యాన్ని పాక్ కు చెందిన జియో వెల్ల‌డించింది.

పెట్రోల్ కు సంబంధించి రూ. 22.20 చొప్పున పెంచితే రూ. 17.20 రూపాయ‌ల పెంపుతో డీజిల్ ధ‌ర పెంచింది. డాల‌ర్ తో రూపాయి విలువ క్షీణించ‌డం వ‌ల్ల ఈ పెరుగుద‌ల చోటు చేసుకుందని ఆర్థిక విభాగం ప్ర‌క‌టించింది. రూ.12.90 రూపాయ‌ల పెంపు త‌ర్వాత కిరోసిన్ నూనె ఇప్పుడు లీట‌ర్ కు రూ. 202.73 రూపాయ‌ల‌కు పెరిగింది. డీజిల్ ఆయిల్ 9.68 రూపాయ‌లు పెరిగిన త‌ర్వాత లీట‌ర్ కు రూ. 196.68 పెర‌గ‌డం విస్తు పోయేలా చేసింది. పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌ల పెరుగుద‌ల తీవ్ర ప్ర‌భావం చూపుతోంది.

Also Read : పాకిస్తాన్ లో చైనా ‘కాన్సుల‌ర్’ క్లోజ్

Leave A Reply

Your Email Id will not be published!