Pilli Subhash Chandra Bose : మంత్రిపై ఎంపీ పిల్లి కామెంట్స్
మా క్యాడర్ ను వేధిస్తున్నారంటూ ఫైర్
Pilli Subhash Chandra Bose : వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమ పార్టీకి చెందిన మంత్రి వేణు గోపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ క్యాడర్ ను కావాలని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపించారు. మంత్రికి గనుక సీటు కేటాయిస్తే తాను రామచంద్రాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. ఆదివారం ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ మీడియాతో మాట్లాడారు.
Pilli Subhash Chandra Bose Comments
అవసరం అనుకుంటే తాను రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని అన్నారు. తాను పార్టీ సపోర్ట్ లేకుండా గెలిచే దమ్ము తనకు ఉందన్నారు. అవసరం అనుకుంటే, పార్టీ క్యాడర్ ఒప్పుకుంటే స్వచ్చంధంగా బయటకు వస్తానని ,కానీ జగన్ తో తనకు గొడవలు లేవన్నారు.
ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న వేణుగోపాల్ , మాజీ మంత్రిగా పని చేసి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పిల్లి(Pilli Subhash Chandra Bose) మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య సీటు పంచాయతీ ముదిరింది. వివాదానికి ప్రధాన కారణం రామచంద్రాపురం సీటు వ్యవహారం. జిల్లా ఇంఛార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని గొడవ లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు. కానీ ఎక్కడా ఇద్దరు నేతలు తగ్గడం లేదు. ఇద్దరికీ ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పట్టుంది.
Also Read : Pawan Kalyan Jagan : వాలంటీర్లకు బాస్ ఎవరో చెప్పు