Pilot Rohit Reddy ED : ఈడీ ఇరికించాలని చూస్తోంది – పైలట్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
Pilot Rohit Reddy ED : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పై సంచలన ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. నలుగురు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఈడీ తనను ఇబ్బందికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. మరో వైపు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ సర్కార్ ను పడగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆరోపించడం కలకలం రేపింది.
ఇప్పటికే ఎమ్మెల్యేలు డేగా కాంతా రావు, గువ్వల బాలరాజు, విష్ణు వర్దన్ రెడ్డి, రోహిత్ రెడ్డి లను ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న పైలట్ ను విచారణ చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ. కేంద్ర ఏజెన్సీ తనను బెదిరించేందుకు యత్నిస్తోందంటూ మండిపడ్డారు పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy ED).
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ కుట్రను బయట పెట్టినందుకే ఈడీ తనను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. తన ఫామ్ హౌస్ లో డబ్బు మార్పిడి జరగలేదన్నారు. ఈడీ డిసెంబర్ 19, 20 తేదీల్లో తనను విచారణకు పిలిచింది. అయితే తనను ఏ కేసుకు సంబంధించి విచారణకు పిలిచారనే విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పలేదన్నారు రోహిత్ రెడ్డి.
Also Read : రద్దు చేస్తడు ఎన్నికలకు పోతడు