PM Modi : భారత దేశ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచేవి పండుగలు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దేశ చరిత్రలో ఆధ్యాత్మికతకు కొత్త సొబగులు అద్దే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఆదివారం ఉత్తర ప్రదేశ్ కు చేరుకున్నారు.
నేరుగా అయోధ్య ఆలయానికి విచ్చేశారు. ప్రధానమంత్రికి సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath), గవర్నర్ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మొదటిసారిగా అయోధ్యలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఏకంగా 18 లక్షల ప్రమిదలను వెలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రధాన మంత్రి మోదీ.
ఈ దీపోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. లక్షలాది మంది మోదీ పాల్గొన్న కార్యక్రమాన్ని తిలకించారు. అంతకు ముందు రామ జన్మ భూమి వద్ద ప్రధాన మంత్రి పూజలు చేశారు. అయోధ్య నగరం దేదీప్య మానంగా వెలుగుతోంది. ఎక్కడ చూసినా దీపాలతో అలంకరించారు. మొత్తం పండుగ శోభ సంతరించుకుంది.
ఇదిలా ఉండగా ఆగస్ట్ 5, 2020న రామ మందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి భూమి పూజ చేశారు. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా దీపోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు ప్రధాన మంత్రి(PM Modi). ఈ సందర్భంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అయోధ్యలోని రాముడిని కోరుకున్నానని తెలిపారు నరేంద్ర మోదీ. ఇలాంటి సంస్కృతి ఇంకెక్కడా లేదన్నారు ప్రధాని.
Also Read : నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగిన రాకెట్