Modi : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఉద్యమ సారథిగా చరిత్రలో నిలిచి పోయిన ఆయనకు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది.
పలువురు మంత్రులు, నాయకులు, వ్యాపారవేత్తలు, సంస్థలు, అధినేతలు, ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పెద్దలు బర్త్ డే విషెస్ తెలియ చేస్తున్నారు. తాజాగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi ) పుట్టిన రోజు అభినందనలు తెలిపారు.
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు విషెష్ తెలిపారు. రావుజీ మీరు చిరకాలం ఆయురారోగ్యంగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి కేసీఆర్ ప్రధానంగా మోదీని టార్గెట్ చేస్తూ వచ్చారు.
సంచలన ఆరోపణలతో పాటు వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య అగాధం మరింత పెరిగింది.
హైదరాబాద్ లోని ముచ్చింతల్ ఏర్పాటు చేసిన భారీ విగ్రహం శ్రీ భగవద్ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహానికి పీఎం(Modi )వచ్చినా హాజరు కాలేదు. ఇక రాష్ట్రపతి కి మాత్రం ఆహ్వానం పలికారు.
కానీ సువర్ణమూర్తి ప్రారంభోత్సవంలో డుమ్మా కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. కావాలనే రాలేదని మోదీని అవమానించారంటూ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
తనకు జ్వరం వచ్చిందని అందుకే తాను హాజరు కాలేక పోయానని స్పష్టం చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం. ఈ తరుణంలో మోదీ గ్రీటింగ్స్ చెప్పడం ఇరు పార్టీల వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఎంతైనా మోదీ నా మజాకా అంటున్నారు తెలిసిన వారు.
Also Read : కేసీఆర్ నీ పోరాటానికి నేను కూడా సై