PM Modi CM YS Jagan : పీఎం..సీఎం సంతాపం..పరిహారం
కందుకూరు ఘటనపై దిగ్భ్రాంతి
PM Modi CM YS Jagan : ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. మరో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చని పోయిన ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సోమూ వీర్రాజు కోరారు. కందుకూరు ఘటనపై తీవ్రంగా స్పందించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(PM Modi CM YS Jagan). ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున చని పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ,గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన గురువారం తీవ్ర సంతాపాన్ని తెలియ చేశారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి కందుకూరు ఘటనపై స్పందించారు.
ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మృతుల, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. చని పోయిన వారికి రూ. 2 లక్షల చొప్పున సాయం చేస్తామని తెలిపారు. ఇక గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ. 50 వేలు అందజేస్తామని పేర్కొన్నారు ఏపీ సీఎం. ఎలాంటి సహాయం అయినా కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
Also Read : ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బిజీ