PM Modi Condolence : బ‌స్సు ప్ర‌మాదంపై మోదీ దిగ్భ్రాంతి

బాధిత కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా

PM Modi Condolence : మ‌హారాష్ట్ర‌లో శ‌నివారం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఎక్స్ ప్రెస్ వే పై పూణేకు 33 మంది ప్ర‌యాణీకుల‌తో వెళుతున్న బ‌స్సు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మంట‌లు చెల‌రేగాయి. టైర్లు ప‌గిలి పోయాయి. మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో 25 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఏడు మంది బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. వారికి తీవ్రంగా గాయాల‌య్యాయి. బుల్దానా ఎస్పీ హుటా హుటిన అక్క‌డికి చేరుకుని బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ఘోర బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌గాఢ సానుభూతిని బాధిత కుటుంబాల‌కు తెలిపారు. తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తూ ఒక్కో కుటుంబానికి రూ. 2 ల‌క్ష‌లు ప్ర‌ధాన‌మంత్రి నిధి కింద ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో బ‌తికి బ‌య‌ట ప‌డిన క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భగ‌వంతుడిని కోరుకుంటున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రెండు ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 50,000 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి. ఇదిలా ఉండ‌గా మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. రూ. 5 ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.

Also Read : Maharashtra Bus Accident : మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!