PM Modi : వైద్యుల పాత్ర అత్యంత కీల‌కం – మోదీ

జాతీయ డాక్ట‌ర్ల దినోత్స‌వం

PM Modi : జూలై 1న జాతీయ వైద్యుల దినోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దేశంలోని డాక్ట‌ర్ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుల‌కు, వారితో పాటు డాక్ల‌ర్ల సంఘాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. మాన‌వ మ‌నుగ‌డ‌లో అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని ప్ర‌శంసించారు ప్ర‌ధాన‌మంత్రి. అత్యంత అపూర్వ‌మైన కాలాల మ‌ధ్య కూడా వైద్యులు అత్యున్న‌త స్థాయిలో ధైర్యాన్ని, నిస్వార్థ‌త‌ను, నిబ‌ద్ద‌త‌త‌ను క‌లిగి ఉన్నందుకు ఈ దేశం రుణ‌ప‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

వైద్యుల అంకిత భావం వైద్యాని కంటే మించిన‌ద‌ని పేర్కొన్నారు. అది మ‌న స‌మాజానికి మ‌రింత ఆశ‌ను, ఇంకొంత బ‌లాన్ని అంద‌జేస్తుంద‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). ప్ర‌ధానంగా క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో వైద్యులు అందించిన సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో సైతం కొంద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని, వారి నిబ‌ద్ద‌త‌కు తాను స‌లాం చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇదిలా ఉండగా భార‌త దేశంలో జూలై 1న ప్ర‌తి ఏటా వైద్యుల దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ఖ్యాత వైద్యుడు, ప‌శ్చిమ బెంగాల్ మాజీ సీఎం బిధాన్ చంద్ర రాయ్ గౌర‌వార్థం దీనిని జ‌రుపుకుంటారు. ఆయ‌న జ‌న‌నం, మ‌ర‌ణం ఒకే రోజు జూలై 1న వ‌స్తాయి. ఆయ‌న‌కు 1961లో భార‌త ర‌త్న అవార్డు ల‌భించింది. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2022ను కేంద్ర ప్ర‌భుత్వం ఫ్యామిలీ డాక్ట‌ర్స్ ఆన్ ది ఫ్రంట్ లైన్ గా ప్ర‌క‌టించింది.

Also Read : CM Siddaramaiah : వైద్యులు క‌నిపించే దేవుళ్లు

 

Leave A Reply

Your Email Id will not be published!