PM Modi : బెంజిమిన్ నెత‌న్యాహుకు మోదీ కంగ్రాట్స్

నూత‌న ప్ర‌ధానిగా ఎన్నికైనందుకు అభినంద‌న‌

PM Modi : ఇజ్రాయెల్ కు చెందిన బెంజిమిన్ నెత‌న్యాహుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) అభినందించారు. పీఎం యైర్ లాపిడ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మిని అంగీక‌రించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బెంజిమ‌న్ నెత‌న్యాహుకు కంగ్రాట్స్ తెలిపారు. ఇజ్రాయెల్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు.

భార‌త దేశం – ఇజ్రాయెల్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత లోతుగా చేసేందుకు ఉమ్మ‌డి ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించేందుకు తాను ఎదురు చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి యైర్ లాపిడ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మిని అంగీక‌రించారు.

మిత‌వాద పార్టీల సంకీర్ణం త‌దుప‌రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు , దేశాన్ని పీడిస్తున్న రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌ను అంతం చేసేందుకు పార్ల‌మెంట్ లో సౌక‌ర్య‌వంత‌మైన మెజారిటీని సాధించింది. నాకు సంతోషంగా ఉంది. మొద‌టి నుంచి భార‌త్ , ఇజ్రాయెల్ మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంద‌న్నారు న‌రేంద్ర మోదీ.

బెంజిమ‌న్ నెత‌న్యాహుతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని పేర్కొన్నారు పీఎం. ట్విట్ట‌ర్ వేదిక‌గా నెత‌న్యాహును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మున్ముందు ఇజ్రాయెల్ తో సంబంధం కొన‌సాగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi).

భార‌త‌దేశం, ఇజ్రాయెల్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు పీఎం. ఇరు దేశాల ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం కోసం ఫ‌ల‌వంత‌మైన ఆలోచ‌న‌ల మార్పిడిని కొన‌సాగించాల‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా 99 శాతం ఓట్ల లెక్కింపుతో నెత‌న్యాహు నేతృత్వంలోని మిత‌వాద కూట‌మి 120 మంది స‌భ్యుల‌కు గాను 64 సీట్ల‌తో ఆధిక్యాన్ని సంపాదించింది. తిరిగి అధికారంలోకి రావ‌డానికి మార్గం సుగ‌మం చేసింది.

Also Read : గుజ‌రాత్ లో ప్ర‌చారానికి మోదీ శ్రీ‌కారం

Leave A Reply

Your Email Id will not be published!