PM Modi Review : బ్రిడ్జి కూలిన ఘటనపై మోదీ కీలక సమీక్ష
ఉన్నత స్థాయి అధికారులతో పీఎం ఆరా
PM Modi Review : గుజరాత్ లో ఆదివారం రాత్రి మోర్బీ వద్ద వంతెన కూలిన ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా 141 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 171 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రధాన మంత్రి గుజరాత్ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎంను ఆదేశించారు. భారత రక్షణ, భద్రతా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఇదే సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం రూ. 2 లక్షలు ప్రకటించింది.
గాయపడిన వారికి రూ. 50,000 తక్షణ సాయం చేస్తున్నట్లు పీఎం వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం మరణించిన కుటుంబాలకు రూ. 4 లక్షలు ఒక్కో కుటుంబానికి , గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50,000 ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం. ఇదిలా ఉండగా నవంబర్ 1 మంగళవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోర్భీ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు.
అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం చేపట్టారు(PM Modi Review). ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
గాంధీ నగర్ లోని రాజ్ భవన్ లో ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. బాదితులైన వారికి సాధ్యమైనంత త్వరగా సహాయం అందేలా చూడాలని సీఎంను ఆదేశించారు ప్రధాని మోదీ.
Also Read : పాలస్తీనా శరణార్థుల కోసం భారత్ సాయం