Ravi Shankar Prasad : మోదీ అందివచ్చిన నాయకుడు
పీఎం నాయకత్వంలో భారత్ సూపర్ పవర్
Ravi Shankar Prasad : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నాయకత్వంలో భారత దేశం కొత్తగా సూపర్ పవర్ గా ఎదుగుతోందన్నారు బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్. 50కి పైగా సమావేశాలలో పాల్గొని మూడు దేశాల్లో పర్యటించిన తర్వాత పీఎం భారత్ కు తిరిగి వచ్చారు. మే 19న ఢిల్లీ నుంచి జపాన్ వెళ్లి జీ7 సదస్సులోపాల్గొన్నారు.
జపాన్ , పాపువా న్యూ గినియా , ఆస్ట్రేలియాలలో పర్యటించిన మోదీకి ఘనమైన స్వాగతం పలికిందన్నారు రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad). మోడీ నేతృత్వంలో భారత దేశం ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. న్యూఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడారు రవి శంకర్ ప్రసాద్. ప్రతి భారతీయుడు గర్వ పడేలా మోదీ చేశారని కితాబు ఇచ్చారు.
తన టూర్ ముగించుకుని దేశానికి వచ్చిన మోదీకి ఘన స్వాగతం లభించింది. 12 మందికి పైగా ప్రపంచ దేశాధి నేతలను కలుసుకున్నారని చెప్పారు రవి శంకర్ ప్రసాద్. మే 22న పాపువా న్యూ గినియా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. సిడ్నీలో మోదీ చేసిన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.
అంతే కాదు ఆస్ట్రేలియా దేశ ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఆపై మోదీ రియల్ బాస్ అంటూ కొనియాడారు. తాను భారత్ పర్యటనకు వెళ్లిన సమయంలో తనకు లభించిన స్వాగతాన్ని ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు.
Also Read : CM YS Jagan