PM Modi : విక్రాంత్ లో ప్ర‌యాణం మోదీ ఉద్వేగం

చెప్పేందుకు ఎలాంటి ప‌దాలు రావ‌డం లేదు

PM Modi : గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భావోద్వేగానికి లోన‌య్యారు. ఇటీవ‌ల గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ మ‌ర‌ణించిన స‌మ‌యంలో కంట త‌డి పెట్టారు.

రూ. 20,000 కోట్ల ఖ‌ర్చుతో దేశీయంగా స్వ‌యంగా త‌యారు చేశారు ఐఎన్ఎస్ విక్రాంత్ ను. కేర‌ళ లోని కొచ్చి లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా గార్డ్ ఆఫ్ హాన‌ర్ ను స్వీక‌రించారు. అనంత‌రం ఈ దేశం గ‌ర్వించ‌ద‌గిన స‌న్నివేశంగా పేర్కొన్నారు ప్ర‌ధానమంత్రి. 1,600 మందికి పైగా సిబ్బంది ఉండేలా దీనిని తీర్చిదిద్దారు.

దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింద‌ని కొనియాడారు న‌రేంద్ర మోదీ(PM Modi) . ఇందుకు సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ ను తాను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

విక్రాంత్ లో ఉన్న‌ప్పుడు తాను ఎంతో అనుభూతికి లోనైన‌ట్లు చెప్పారు. భార‌త్ లో త‌యారు చేసిన తొలి విమాన వాహ‌న నౌక తో ప్రపంచంలోనే అమెరికా, చైనా, ఫ్రాన్స్ , ర‌ష్యా దేశాల స‌ర‌స‌న భార‌తం దేశం కూడా నిలిచింద‌న్నారు.

దేశానికి చారిత్రాత్మ‌క‌మైన రోజు. తాను ఐఎన్ఎస్ విక్రాంత్ లో ప్ర‌యాణం చేసిన‌ప్పుడు క‌లిగిన ఆనందం వ‌ర్ణించ లేద‌న్నారు. తాను అనుభ‌వించిన ఆనందాన్ని మాట‌లలో, ప‌దాల‌లో వ‌ర్ణించ లేన‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) .

ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేశారు. ఆయ‌న విక్రాంత్ ను పెద్ద‌ది, గొప్ప‌ది, విభిన్న‌మైన‌ది..ప్ర‌త్యేక‌మైన‌ద‌ని ప్ర‌శంసల‌తో ముంచెత్తారు మోదీ.

విక్రాంత్ కేవ‌లం యుద్ద నౌక మాత్ర‌మే కాదు. ఇది 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశ కృషి, ప్ర‌తిభ‌, ప్ర‌భావం , నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు.

Also Read : రికార్డు స్థాయిలో కేసుల ప‌రిష్కారం

 

Leave A Reply

Your Email Id will not be published!