PM Modi TamilNadu : దక్షిణాది పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శనివారం తెలంగాణలోని హైదరాబాద్ లో రూ. 11,000 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు కొత్తగా వందే భారత్ రైలును ఇవాళ ప్రారంభించారు.
అనంతరం చెన్నైలో కొత్తగా నిర్మించిన రెండో టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. అంతకు ముందు చెన్నై నుంచి కోయంబత్తూర్ వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi TamilNadu) జెండా ఊపి ప్రారంభించారు.
డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆధునిక ఫీచర్లు, ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన ప్రారంభ స్పెషల్ ట్రైన్ ను స్టార్ట్ చేశారు. రైలులో పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. రెండు నగరాల మధ్య ఈ రైలు ప్రారంభం వల్ల సమయం ఆదా అవుతుంది. వేగంగా వెళ్లేందుకు మార్గం ఏర్పడతుంది.
రాష్ట్ర రాజధాని, పశ్చిమ పారిశ్రామిక నగరం మధ్య ప్రయాణ సమయానికి గంటకు పైగా తగ్గిస్తుంది. స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి దీనిని తయారు చేశారు. అన్ని కోచ్ లలో సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ లు అమర్చారు ఈ ట్రైన్ లో. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.
Also Read : రాహుల్ కామెంట్స్ హిమంత సీరియస్