Cabinet Expansion : కేబినెట్ విస్తరణపై మోదీ ఫోకస్
ఎవరికి దక్కేనో ఛాన్స్
Cabinet Expansion : భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లను చేజిక్కించు కోవాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే చాప కింద నీరులా పని చేసుకుంటూ పోతోంది ఆ పార్టీ.
గత ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో మిశ్రమ స్పందన వచ్చింది. గుజరాత్ లో మరోసారి బీజేపీ పవర్ లోకి వస్తే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అధికారాన్ని కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ఈ ఎన్నికలు వచ్చేకంటే ముందు కేంద్ర కేబినెట్ ను ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోదీ నేతృత్వంలో అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమైనట్లు టాక్. బడ్జెట్ 2023కి ముందు కేబినెట్ ను విస్తరించ వచ్చని(Cabinet Expansion) జోరుగా ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది.
మకర సంక్రాంతి 14 లోపు కొంత మంది ఎంపీలకు కేబినెట్ లో చోటు దక్కనుంది. మరో వైపు జాతీయ పార్టీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలం కూడా పూర్తవుతోంది. జనవరి 20న ముగుస్తుంది.
జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ఇక ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కో ఎంపీకి మంత్రివర్గంలో చోటు దక్కనుందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే కిషన్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. ఇక కొత్తగా వచ్చే వారిలో ధర్మపురి అర్వింద్ , బండి సంజయ్ , లక్ష్మణ్ , సోయం బాపురావు ఉన్నారు. దక్షిణాది నుంచి కూడా పలువురిని తీసుకునే అవకాశం లేక పోలేదు.
Also Read : రామ మందిరం ప్రచార అస్త్రం