PM Modi Honoured : మోదీకి ఫ్రాన్స్ అత్యున్న‌త పుర‌స్కారం

ప్ర‌ధాన‌మంత్రికి అధ్య‌క్షుడి అంద‌జేత‌

PM Modi Honoured : ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందిన భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఫ్రాన్స్ దేశం ఆహ్వానం మేర‌కు ప్ర‌ధాని రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ దేశానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్రాన్స్ ప్ర‌ధాని ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

సైనిక క‌వాతు నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు నరేంద్ర మోదీ(PM Modi). ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని పీఎం హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి.

కీల‌క ప‌ర్య‌ట‌న‌లో భాగంగా న‌రేంద్ర మోదీని ఫ్రాన్స్ దేశ అధ్య‌క్షుడు మోక్రాన్ ఘ‌నంగా స‌త్క‌రించారు. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన అత్యున్న‌త‌మైన పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు మోదీకి ద‌క్కిన అవార్డుల‌లో కంటే ఫ్రాన్స్ ఇచ్చిన పుర‌స్కారం గొప్ప‌ది కావ‌డం విశేషం.

ఎన్నో దేశాలు ఇప్ప‌టి దాకా మోదీని స‌త్క‌రించాయి. స‌మున్న‌తంగా గౌర‌వించాయి. మిలిట‌రీ లేదా సివిలియ‌న్ ఆర్డ‌ర్ ల‌లో అత్యున్న‌త‌మైన ఫ్రెంచ్ గౌర‌వాన్ని ప్ర‌ధాని మోదీకి ప్ర‌దానం చేశారు ఫ్రాన్స్ చీఫ్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.

అంత‌కు ముందు ఫ్రాన్స్ దేశ రాజ‌ధాని పారిస్ లో ప్ర‌వాస భార‌తీయులు ఏర్పాటు చేసిన స‌మావేశానికి హాజ‌ర‌య్యారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి కీల‌క ప్ర‌సంగం చేశారు. మీ అంద‌రి ఆద‌రాభిమానాల‌ను చూసి సంతోషం క‌లిగింద‌న్నారు ప్ర‌ధాని.

Also Read : PM Modi : ఫ్రాన్స్ తో భార‌త్ చిర‌కాల స్నేహం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!