PM Modi Vande Bharath Train : వందే భారత్ రైలు ప్రారంభం
భాగ్యలక్ష్మిని వెంకటేశ్వరుడితో కలిపాం
PM Modi Vande Bharath : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్ రైలును శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు(PM Modi Vande Bharath). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి నగరాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి పట్టణంతో కలిపామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి నేటి దాకా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసే అదృష్టం తనకు లభించిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఆయన ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయాన్ని ప్రస్తావించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పుననరుద్దరణ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందించామని , కానీ ఇందుకు రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఇవాళ 11 వేల కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించామని చెప్పారు నరేంద్ర మోదీ.
తెలంగాణలో కుటుంబ పాలనకు, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రధానమంత్రి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఆయన గైర్హాజర్ అయ్యారు. సీఎం తరపున ప్రభుత్వం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపింది. ఇక నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఉన్నారు.
Also Read : ఫేక్ న్యూస్ ను కేంద్రం నిర్ణయిస్తుందా