Modi : ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi). గురువారం ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంను మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మొదటి టిక్కెట్ ను కొనుగోలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు పని చేసిన 14 మంది ప్రధానమంత్రుల జీవిత చరిత్రలు, వారు అనుసరించిన మార్గాలు, ఆచరించిన సూత్రాలకు సంబంధించి ఇందులో పొందు పర్చారు.
పీఎంల కథలు, వివిధ సవాళ్లను ఎదుర్కొన్న తీరు, దేశాన్ని నడిపించిన విధానం ఈ మ్యూజియం ద్వారా తెలుసు కునేందుకు వీలు కలుగుతుందన్నారు నరేంద్ర మోదీ.
ఈ ప్రదర్శనశాల ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి భారత దేశ చరిత్ర గురించి కూడా తెలియ చేస్తుందన్నారు. ఈ సందర్బంగా ఈ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంను ప్రధానమంత్రులందరికీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాన మంత్రి(Modi).
ప్రధానమంత్రులందరి సహకారాన్ని పార్టీలకు అతీతంగా గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ నాయకుల గురించి అవగాహన కల్పించేందుకు గాను మ్యూజియం డెవలప్ చేశారు.
ఇది వారి భావ జాలమో లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ఈ మ్యూజియంలో దేశానికి సంబంధించి మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జీవితం, సేవల గురించి ఉంది.
ప్రపంచంలోని నలుమూలల నుంచి ఆయనకు లబించిన అనేక బహుమతులు ఇందులో ప్రదర్శించారు. భయనం లోగో దేశం , ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చక్రం పట్టుకున్న భారత దేశ ప్రజలను సూచిస్తుండడం విశేషం.
Also Read : ఆరు నూరైనా రాజీనామా చేయను