PM Modi : రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులు
రూ. 453.5 కోట్ల కేటాయింపు
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అమృత్ భారత్ పథకం కింద ప్రధానమంత్రి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేయనున్నారు. అటు ఏపీలో ఇటు తెలంగాణలో వీటిని ప్రారంభించనున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 18 రైల్వే స్టేషన్ లలో రూ. 453.5 కోట్ల విలువైన అభివృద్ది పనులకు ఆగస్టు 7న వర్చువల్ గా ప్రారంభిస్తారు నరేంద్ర మోదీ.
PM Modi Announce
ఇదిలా ఉండగా మోదీ(PM Modi) పనులు ప్రారంభించే రైల్వే స్టేషన్లు ఇలా ఉన్నాయి. కర్నూలు సిటీలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ కు రూ. 42.6 కోట్లతో చేపట్టనున్నారు. ఇక విజయనగరం రైల్వే స్టేషన్ లో పనులకు రూ. 35.76 కోట్లు , తెనాలి రైల్వే స్టేషన్ లో రూ. 27.13 కోట్లు, తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ లో రూ. 27.13 కోట్లు, అనకాపల్లి రైల్వే స్టేషన్ లో రూ. 27.1 కోట్లు కేటాయించింది కేంద్రం.
నిడదవోలు రైల్వే జంక్షన్ లో అభివృద్ది పనులకు రూ. 27.13 కోట్లు , దువ్వాడ రైల్వే స్టేషన్ లో రూ. 26.31 కోట్లు , నరసాపురం రైల్వే స్టేషన్ కు రూ. 25.7 కోట్లు, రేపల్లె రైల్వే స్టేషన్ కు రూ. 25.5 కోట్లు, సింగరాయ కొండ లో 25.13 కోట్లు, పలాస 23.85 కోట్లు, భీమవరం 22.1 కోట్లు, కాకినాడ టౌన్ జంక్షన్ 21.1 కోట్లు, ఏలూరు 21.1 కోట్లు, పిడుగురాళ్ల 19.3 కోట్లు, తుని 19.13 కోట్లు, ఒంగోలు 19.1 కోట్లు, దొనకొండ లో 18.3 కోట్లు విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. వీటిని చేపడితే ప్రయాణీకులకు ఆధునిక వసతి సౌకర్యాలు కలుగనున్నాయి.
Also Read : MLC Kavitha Students : ఎమ్మల్సీ కవితకు విద్యార్థులు థ్యాంక్స్