PM Modi Invite : సౌదీ రాజు సల్మాన్ కు మోదీ ఆహ్వానం
భారత్ ను పర్యటించాలని కోరిన పీఎం
PM Modi Invite : సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Invite) ఆహ్వానించారు. గతంలో మొదటిసారిగా ఫిబ్రవరి 2019లో పర్యటించారు.
సౌదీ అరేబియా జాతీయ దినోత్సవానికి ముందు ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కి ప్రధాన మంత్రి తన శుభాకాంక్షలు తెలియ చేశారు.
ఈ సందర్భంగా భారత దేశాన్ని సందర్శించాల్సిందిగా కోరారు.
ఈ మేరకు ఆహ్వానం కూడా పంపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సౌదీ అరేబియాలో మొదటిసారిగా పర్యటించారు.
ఆయన తన టూర్ ను ముగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. రాజకీయ, వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భద్రతతో అన్ని ప్రధాన రంగాలకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే చర్యలపై చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సౌదీలోని జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(Prince Mohammed Bin Salman) ను కలుసుకున్నారు జై శంకర్. సెప్టెంబర్ 23న సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి లిఖిత పూర్వక సందేశాన్ని సల్మాన్ కు అందజేశారు.
ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించు కునేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షించామని సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ తెలిపింది.
Also Read : వివాదాలకు సైనిక పరిష్కారం లేదు