PM Modi Jai Hind : ఇస్రో టీంకు మోదీ స‌లాం

మీ కృషితో దేశం గ‌ర్విస్తోంది

PM Modi Jai Hind : ఇస్రో ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం చంద్ర‌యాన్ -3 (బాహుబ‌లి రాకెట్ ) విజ‌య‌వంతంగా నింగిలోకి ఎగిసింది. ఈ సంద‌ర్బంగా యావ‌త్ భార‌తంతో పాటు ప్ర‌పంచం కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా, ర‌ష్యా, చైనాతో పాటు భార‌త్ ఇది గ‌నుక స‌క్సెస్ అయితే నాలుగో స్థానానికి చేరుతుంద‌ని ఇస్రో చైర్మ‌న్ సోమ్ నాథ్.

అంత‌రిక్షంలోకి రివ్వున దూసుకు వెళ్లిన చంద్రయాన్ -3 పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). ఆయ‌న రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఫ్రాన్స్ లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ఇస్రో టీంను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. చంద్ర‌యాన్ రాకెట్ ను త‌యారు చేసిన టీంకు సెల్యూట్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇది ప్ర‌తి భార‌తీయుడికి నిజంగా గ‌ర్వ కార‌ణం. జూలై 14 ,2024 అనేది భార‌త దేశ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ అద్భుత‌మైన మిష‌న్ ను విజ‌య‌వంతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌తి ఒక్క‌రికీ దేశం రుణ‌ప‌డి ఉంద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాని.

ఇదిలా ఉండ‌గా చంద్ర‌యాన్ చంద్రుడి వ‌ద్ద‌కు చేరుకునేందుకు 40 రోజుల‌కు పైగా ప‌డుతుంద‌ని చెప్పారు ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్. అంకిత‌భావం, నిబ‌ద్ద‌తతో త‌యారు చేసినందుకు శాస్త్ర‌వేత్త‌ల‌ను, ఇస్రో టీంను అభినందించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.

Also Read : Sukesh Chandrasekhar : కేటీఆర్..క‌విత‌పై సుకేష్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!