PM Modi : వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
స్టార్ట్ చేసిన ప్రధానమంత్రి మోదీ
PM Modi : వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హై స్పీడ్ రైలును భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. గాంధీ నగర్ నుండి ముంబైకి ఈ ట్రైన్ నడుస్తుంది. వందే భారత్ కు సంబంధించి ఇది మూడో రైలు. జెండా ఊపి నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు.
గాంధీనగర్ రాజధాని రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10.30 గంటలకు రైలును స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని గాంధీనగర్ , కలుపూర్ రైల్వే స్టేషన్ మధ్య రైడ్ కోసం రైలు ఎక్కారు.
మహారాష్ట్ర, గుజరాత్ రాజధాని నగరాలను కలిపే ఈ రైలు దేశంలో మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) కావడం విశేషం. వందే భారత్ కు సంబంధించి మొదటి రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మార్గంలో ప్రారంభించారు.
అనంతరం రెండో రైలు న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా మార్గంలో స్టార్ట్ చేశారు. ఈ రైలు ప్రయాణీకులకు విమానం లాంటి
ప్రయాణ అనుభవాన్ని , కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఇది స్వదేశీంగా అభివృద్ది చేయబడిన రైలు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ ఇందులో ఏర్పాటు చేశారు. గాంధీ నగర్ – ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 1 నుండి దాని కమర్షియల్ రన్ ప్రారంభం అవుతుంది.
ఆదివారాలు మినహా వారానికి ఆరు రోజులు ఈ వందే భారత్ మూడవ రైలు నడుస్తుంది. ముంబై సెంట్రల్ స్టేషన్ నుండి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది.
ఇక తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ నుంచి మధ్యాహ్నం 2.05 గంటలకు బయలు దేరి ముంబై సెంట్రల్ కు రాత్రి 8.35 గంటలకు చేరుకుంటుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ కు రూ. 2,505 ఛార్జి, చైర్ కార్ కి రూ. 1, 385 గా నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ 16 కోచ్ లతో స్వదేశీ టెక్నాలజీతో రూపొందొంచారు. 140 సెకన్లలో 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
Also Read : బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది