PM Modi : జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ తో మోదీ ములాఖ‌త్

ద్వైపాక్షిక సంబంధాల‌పై స‌మీక్ష

PM Modi : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi) శ‌నివారం జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్కోల్ట్ తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రు నేత‌లు ద్వైపాక్షిక సంబంధాల‌పై స‌మీక్షించారు. జ‌పాన్ లోని హీరోషిమాలో గ్రూప్ ఆఫ్ సెవ‌న్ (జి7) ముంద‌స్తు ఎకాన‌మీ స‌ద‌స్సు సంద‌ర్భంగా ఇరువురు నేత‌లు క‌లుసుకున్నారు.

కీల‌క‌మైన అంశాల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. భార‌త్ , ఈయూ వాణిజ్యానికి జ‌ర్మ‌నీ మ‌ద్ద‌తును ప్ర‌ధాని మోదీ స్వాగ‌తించారు. ప్రాంతీయ ప‌రిణామాలు, ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత స‌వాళ్ల‌ను ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య‌.

ద్వైపాక్షిక సంబంధాల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రిగింది. ఎందుకంటే ఇరు దేశాలు ఇప్ప‌టికే ప‌ర‌స్ప‌రం అవ‌గాహ‌న క‌లిగి ఉన్నాయి. ప్రాంతీయ ప‌రిణామాలు, ప్ర‌పంచ స‌వాళ్లు ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలు.

మొద‌టి నుండి భార‌త దేశం ఎక్క‌డికి వెళ్లినా లేదా ఏ స‌ద‌స్సుకు హాజ‌రైనా ముందు ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న ఉగ్ర‌వాదంపై ఉమ్మ‌డి పోరు సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. త‌న చిర‌కాల మిత్రుడు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ను క‌లుసుకోవ‌డం త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగించింద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : Sharad Pawar Abdullah

Leave A Reply

Your Email Id will not be published!