PM Modi Heeraben : తల్లి ఆశీర్వాదం తనయుడి ఆనందం
అహ్మదాబాద్ లో ఓటు వేసిన పీఎం
PM Modi Heeraben : గుజరాత్ రాష్ట్రంలో సోమవారం రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విలువైన ఓటు హక్కును అహ్మదాబాద్ లో ఓటు వేశారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 1న ముగిసింది. రెండో విడత పోలింగ్ ఉదయమే ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ తల్లికి తనయుడేనని నిరూపించారు. నరేంద్ర మోదీ(PM Modi Heeraben) ఎప్పుడు పర్యటించినా ముందుగా వెళ్లేది తన తల్లి హీరా బెన్ ను కలుసుకుంటారు. ఆమె పాదాలను తాకి , ఆశీర్వాదం తీసుకుంటారు. తను పీఎంగా ఉన్నా తన తల్లిని మాత్రం స్వంత ఇంట్లోనే ఉంచారు. ఇక రెండో విడత ఎన్నికల సందర్భంగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు.
ఇదిలా ఉండగా గుజరాత్ లోని గాంధీనగర్ నివాసం ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లారు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ, హీరా బెన్ ల ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా దేశంలోని రెండు రాష్ట్రాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం శాఖ మంత్రి అమిత్వ చంద్ర షా, గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ , మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ , కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read : పీఓకేను స్వాధీనం చేసుకునే సమయం ఇదే