PM Modi Tribute Gandhi : ఓ మహాత్మా ఓ మహర్షీ – మోదీ
జాతిపిత గాంధీకి సోనియా..రాహుల్ నివాళి
PM Modi Tribute Gandhi : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఇవాళ. సరిగ్గా ఇదే రోజు జనవరి 30న ఆర్ఎస్ఎస్ కు చెందిన నాథురామ్ గాడ్సే గాంధీని కాల్చి చంపారు. గాంధీ చని పోయి నేటికి 75 ఏళ్లు అవుతోంది. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఆయన దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం మహాత్ముడికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం రాహుల్ , ప్రియాంక జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇవాళ వారిద్దరూ స్నో బాల్ కూడా ఆడారు.
అంతే కాకుండా స్వాతంత్ర సమర యోధుల స్మారకార్థం అమర వీరుల దినోత్సవాన్ని కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరో వైపు కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను నిర్వహిస్తోంది. ఇవాళ ఢిల్లీ లోని రాజ్ ఘాట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహాత్ముడి ఘాట్ వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు(PM Modi Tribute Gandhi) అర్పించారు.
ఆయనతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జాతిపిత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన బలిదానం దేశం కోసం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు ప్రధాన మంత్రి మోదీ.
Also Read : మోదీ బీబీసీ నిషేధంపై విచారణ